టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నిన్న త‌న 36వ పుట్టిన రోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల పుట్టిన రోజులు అంటే టాలీవుడ్‌లో సినిమా పేజీల‌లో పెద్ద పెద్ద పోస్ట‌ర్ల‌తో ర‌క‌ర‌కాల బ్యానర్లు వాళ్ల‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెపుతుంటాయ్‌. ఈ క్ర‌మంలోనే తార‌క్ పుట్టిన రోజు కోసం చాలా మంది నిర్మాత‌లు శుభాకాంక్ష‌లు చెపుతూ పోస్ట‌ర్లు వేశారు. వీటిలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ కూడా ఎన్టీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెపుతూ పోస్ట‌ర్ వేసింది.


ఈ పోస్ట‌ర్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫొటో అర‌వింద స‌మేత సినిమాలోని లుక్ కావ‌డం, కింద త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ పేరు ఉండ‌డంతో క్యాజువ‌ల్‌గా హారిక టీం ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పింద‌నుకున్నారు. అయితే ఈ పోస్ట‌ర్ వెన‌క చాలా క‌థే ఉంద‌ని తెలిసింది. గ‌త రాత్రి ఈ పోస్ట‌ర్‌పై అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న్ను క‌లిసేందుకు వెళ్లిన అభిమానుల‌తో త‌న నెక్ట్స్ సినిమా త్రివిక్ర‌మ్‌తోనే ఉంటుంద‌ని హింట్ ఇచ్చేయ‌డంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు.


ఎన్టీఆర్ ప్రస్తుతం RRR తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌య్యేందుకే మ‌రో యేడాది టైం ప‌డుతుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు త్రివిక్ర‌మ్ పేరు తెర‌మీద‌కు రావ‌డంతో ఎన్టీఆర్ నెక్ట్స్ కొర‌టాల శివ‌తో క‌మిట్ అవుతాడ‌ని అంద‌రూ అనుకుంటోన్న టైంలో ఇప్పుడు ఎన్టీఆర్ అనూహ్యంగా కొరటాల శివ‌కు షాక్ ఇచ్చి త్రివిక్ర‌మ్ (ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ ముద్దుగా ఒక‌రికొక‌రు స్వామి అని పిలుచుకుంటూ ఉంటారు)తో క‌మిట్ అవ్వ‌డం అంద‌రికి షాక్ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: