మరి కొన్ని గంటలలో వెల్లడికాబోతున్న ఎన్నికల ఫలితాలు చాల కీలకంగా మారబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ వైఎస్ జగన్ కాబోయే ‘ముఖ్యమంత్రి’ అన్న సంకేతాలు ఇస్తున్న నేపధ్యంలో ఎన్నికల ఫలితాలు రాకుండానే జగన్ కు అభినందనలు తెలుపుతూ బ్యానర్స్ ఫ్లేక్సీలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో తమ పవర్ స్టార్ కింగ్ మేకర్ అవుతాడు అంటూ కలలు కన్న పవన్ వీరాభిమానులు వారి కలలు నేరవేరకుంటే ఈ ఎన్నికల ఫలితాల జడ్జిమెంట్ రోజున వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయమై ఆసక్తి బాగా పెరిగిపోతోంది. ఒక సినిమా ఫంక్షన్ లో పవన్ ప్రస్తావన సరిగ్గా లేకుంటే ‘పవన్ పవన్’ అంటూ నినాదాలు చేసే పవన్ వీరాభిమానులు ప్రజా తీర్పు పై ఎలా స్పందిస్తారు అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో ఈ ఎన్నికలలో ‘జనసేన’ కు పడిన ఓట్ల శాతం కంటే భీమవరం గాజువాకలలో పవన్ గెలుపు విషయం గురించి మాత్రమే పవన్ అభిమానుల స్పందన ఎక్కువగా కనిపించే ఆస్కారం ఉంది. ‘జనసేన’ కు ఎన్నికల ఫలితాలలో ఎక్కువ స్థానాలు రాకపోయినా పవన్ ఒక్కడు గెలిస్తే చాలు అన్న ఆలోచనలలో పవన్ వీరాభిమానులు ఉన్నారు. 

అధికారంలోకి వచ్చే పార్టీని పవన్ గెలిచిన ఆ తక్కువ స్థానాల ప్రాతినిధ్యంతో తమ జనసేనాని ఇరుకున పెడతాడు అన్న అంచనాలతో ఈరోజు తెలియబోయే పవన్ రాజకీయ భవిష్యత్ గురించి వీరాభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కనీస అంచనాలు కూడ తలక్రిందులు అయితే అత్యంత ఆవేశపరులైన పవన్ అభిమానుల తీరు ఈ జడ్జిమెంట్ రోజున ఎలా ఉంటుంది ఎన్నికల ఫలితాల పై పవన్ ఎలా స్పందిస్తాడు అన్న ఆతృత మధ్య చర్చలు జరుగుతుంటే ఏది ఎలా ఉన్నా  ‘పీపుల్స్ జడ్జిమెంట్’ రోజుకు తెల్లవారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: