ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే పై తెలుగుదేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరో ఐదు-ఆరు గంటలలో లగడపాటి సర్వేలో వాస్తవాలు ఎన్నో బయటపడబోతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈవారం ఈ ఎన్నికల ఫలితాల హడావిడి మధ్య లగడపాటి కుటుంబ వారసుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

లగడపాటి రాజగోపాల్ తమ్ముడు లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ లగడపాటి హీరోగా నటించిన ‘ఎవడు తక్కువ కాదు’ మూవీ రేపు విడుదల కాబోతోంది. గత సంవత్సరం అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ మూవీలో అన్వర్ పాత్రలో విక్రమ్ నటించాడు. 

ఇప్పుడు ఏకంగా ఈసారి హీరోగా మారిపోయి కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘గోలీసోడా’ మూవీ రీ మెక్ గా ‘ఎవడు తక్కువ కాదు’ విడుదల కాబోతోంది. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేని కాజల్ ‘సీత’ తో పోటీ పడుతున్న నేపధ్యంలో లగడపాటి రాజగోపాల్ కు తన తమ్ముడి కొడుకు సినిమా ఫలితం పై అంచనాలు వేయగలడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.  

‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్న క్యాప్క్షన్ తో విడుదల కాబోతున్న ఈమూవీ ట్రైలర్ ఇప్పటికే చాలామంది దృష్టిని ఆకర్షించిన నేపధ్యంలో ఈ యంగ్ హీరో విజయం సాధించగలడా అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. టీన్ ఏజ్ లవ్ డ్రామా కథాంశంగా రూపొందిన ఈమూవీ విజయం సాధించగలిగితే రాజకీయాలకు దూరంగా ఉంటున్న లగడపాటి కుటుంబం కనీసం సినిమా రంగంలో అయినా తమ ప్రాభవాన్ని చూపెట్టుకోగలుగుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: