తెలుగు ఇండస్ట్రీలో ‘చిత్రం’తో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు తేజ.  ఆ తర్వాత నితిన్, సదా జంటగా ‘జయం’చిత్రం మంచి ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత తేజ నటించిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు. దాంతో కొంత విరామం తీసుకున్న తేజా ఆ మద్య రానా హీరోగా ‘నేను రాజు నేనే మంత్రి’చిత్రంతో ఘన విజయం అందుకున్నాడు.


తాజాగా కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వం వహించిన 'సీత' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా నటించగా.. సోనూసుద్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.   ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ సంపాదించింది. 
20 సంవత్సరాలు జ‌నాల‌కు దూరంగా, పొల్యూట్ కాకుండా పెరిగిన ఓ అబ్బాయి ఈ జ‌నార‌ణ్యంలోకి వచ్చిన అబ్బాయికి డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకునే అమ్మాయి మద్య జరిగిన పరిచయం..ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో అనేదే ఈ చిత్రం కథ. 

అయితే  కథలో దర్శకుడు సిద్ధం చేసుకున్న కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా వర్కౌట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. ఉన్నాయి. బిత్తిరి సత్తి కామెడీ ఓ మోస్తరుగా ఉందని అంటున్నారు. కథ మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుందని, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసిందని టాక్.  ఇక తనికెళ్లభరణి క్యారెక్టర్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని టాక్.  'సీత' బాక్సాఫీస్ వద్ద ఏస్థాయిలో వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌లో రాంబ్రహ్మం సుంకర నిర్మించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: