భారతీయ రాజకీయాలలో ఉవ్వెత్తున లేచిపడిన కెరటంలా సంచలనాలు సృష్టించిన జగన్ మోహన్ రెడ్డి పై ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక ప్రచురించిన ఆసక్తికర కథనం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఫిలిం మేకర్ అనురాగ్ కాశ్యప్ జగన్ జీవితం పై బయోపిక్ తీయడానికి సరిపడ్డ అన్ని అంశాలు ఉన్నట్లుగా భావిస్తూ ఆ బయోపిక్ నిర్మాణ ఆలోచనలకు జగన్ అనుమతి తీసుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు టాక్.

వాస్తవ సంఘటనలతో కూడిన సినిమాలు తీయడంలో అనురాగ్ కాశ్యప్ కు చాల మంచి పేరు ఉంది. ‘కమ్ బ్యాక్ కిడ్’ పేరుతో ఈ బయోపిక్ ను జగన్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా తీయాలని ఈ బాలీవుడ్ ఫిలిం మేకర్ ఆలోచన అని అంటున్నారు. 

ఒక బయోపిక్ కు అవసరమైన అన్ని మంచి ఎలిమెంట్స్ జగన్ జీవితంలో ఉన్నాయని ఈ ఫిలిం మేకర్ భావిస్తున్నట్లు సమాచారం. సోనిమా గాంధీ చేత తిరస్కరింప బడటం ఆతరువాత జగన్ ను చుట్టుముట్టిన కేసులు ఆపై 16 నెలలు జైలులోనే జీవితం గడుపుతూ పార్టీ నిర్మాణం చేయడం ఆపై జైలు నుండి బయటకు వచ్చి ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ సాధించిన పాదయాత్రలతో పాటు చరిత్ర సృష్టించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో 151 స్థానాలతో అధికారం చేపట్టడం విషయాలు అన్నీ ఈ బయోపిక్ లో ఉండే విధంగా అనురాగ్ కాశ్యప్ తీయడానికి సంకల్పించినట్లు టాక్. 

అయితే ఇలాంటి బయోపిక్ తీయాలి అంటే జగన్ అనుమతి అవసరం. ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి బయోపిక్ ల ప్రయోగానికి జగన్ ఆసక్తి కనపరచారని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం జగన్ దృష్టి అంతా తాను ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పై ఉన్న నేపధ్యంలో ఇలాంటి బయోపిక్ ల నిర్మాణానికి అనుమతి ఇస్తే అది ప్రజలకు తప్పుడు సంకేతాలు కలగచేస్తాయి అన్న భావనతో జగన్ ఈ ఆలోచనలకు సహకరించే అవకాసం లేదని బాలీవుడ్ మీడియా అభిప్రాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: