మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మేనరిజం ఉంటుంది.  అప్పట్లో ప్రతి సినిమాలో ఎదో ఒక మెజారిజాన్ని పెట్టేవారు దర్శకులు.  ఇలా పెట్టడం వలన ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్నది దర్శక నిర్మాతల ఉద్దేశ్యం.  పైగా మెగాస్టార్ మాస్ హీరో.  ఏదైనా ఒక ప్రత్యేకత కల్పిస్తే... ఇక చెప్పాల్సిన అవసరం లేదు.  అందుకే.. మేనరిజంను పెట్టేవారు.  కొండవీటి రాజా సినిమాలో మెగాస్టార్ కు టాయ్.. దెబ్బకాయ్ అనే డైలాగ్ ఉంది.  దీనిని పలికించిన తీరు చాలా కొత్తగా ఉంటుంది.  అంతేకాదు ప్రతి ఒక్కరికి ఈ మేనరిజం నచ్చింది.  దీంతో చాలా రోజులు ఈ డైలాగ్ గురించి చెప్పుకునేవారు. 


మరో సినిమాలో విజయశాంతితో మెగాస్టార్ జమకు జమా లస్కు టపా అనే డైలాగ్ చెప్పించాడు రాఘవేంద్ర రావు.  నిజానికి ఆ డైలాగ్ కు అర్ధం మెగాస్టార్ కు కూడా తెలియదు.  ఓ రోజు మెగాస్టార్ ను అర్ధం ఏంటి అని అడిగితె.. తెలియదు రాఘవేంద్ర రావును అడగమని చెప్పాడు చిరు.  విజయశాంతి వెళ్లి రాఘవేంద్ర రావును అడిగితె... నీ అందానికి నేను దాసుడని అయ్యాను అని అన్నాడు.  ఈ విషయాన్నీ మెగాస్టార్ తో చెప్పింది.  చిరు వెళ్లి దర్శకుడిని అడిగితె... నిన్ను ఎలా పడేస్తానో చూడు అన్నాడట.  అర్ధం ఎలా ఉన్నా.. ఊరమాస్ డైలాగ్ జనాలకు విపరీతంగా నచ్చేసింది.  


మెగాస్టర్ ఒక చేస్తూ నమస్కారం పెట్టడం.  పేస్ కొంచెం లైఫ్ టర్న్ ఇచ్చుకోండి అనే డైలాగ్, చేయి చూడు ఎంత రఫ్ గా ఉందొ అనే డైలాగ్ ఇలా ఎన్నో డైలాగును మెగాస్టార్ మేనరిజంలో భాగం అయ్యాయి.  ఇప్పుడు చాలామంది హీరోలు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.  పవన్ కళ్యాణ్ సైతం తన సొంతంగా కొన్ని మేనరిజంలను సృష్టించుకున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: