మూడున్న‌ర ప‌దుల ముదురు ముద్దుగుమ్మ, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఇప్ప‌ట‌కీ సీనియ‌ర్ హీరోల‌తో సినిమాలు చేస్తూ హిట్లు మీద హిట్లు కొడుతోంది. ద‌శాబ్దంన్న‌ర కాలానికి పైగా తెలుగు, త‌మిళ్‌తో పాటు హిందీ భాష‌ల్లోనే త‌ళుక్కున మెరుస్తోన్న ఈ ముదురు ముద్దుగుమ్మ స‌ర‌స‌న ఆడిపాడేందుకు ఇప్ప‌ట‌కీ మ‌న తెలుగు హీరోలు ఇష్టంతోనే ఉంటారు. తాజాగా త‌మ‌న్నా పెళ్లితో పాటు పాలిటిక్స్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.


త‌మ‌న్నాకు వ‌యస్సు పైబ‌డుతుండ‌డంతో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ‌మ్మా ? అన్న ప్ర‌శ్న ఆమెకు ఎదుర‌వుతూనే ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు పెళ్లి మ్యాట‌ర్ ఎత్తితే త‌ప్పించుకుంటూ వ‌స్తోన్న మిల్కీబ్యూటీ తాజాగా మాత్రం తాను పెళ్లికి రెడీ అని చెప్పేసింది. అలాగే పెళ్లి చేసుకుంటాన‌ని చెపుతూనే కొన్ని కండీష‌న్లు కూడా పెట్టేసింది.


‘మంచి పెళ్లి కొడుకు దొరకాలి. దర్శకుడు విజయ్‌కి కూడా చెప్పాను మంచి పెళ్లి కొడుకు ఉంటే చెప్పమని. మీలో ఎవరైనా మంచి వ్యక్తిని చూస్తే అతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ.’ అంటూ మీడియా ప్ర‌తినిధుల‌కు కూడా చిన్న ఝుల‌క్ ఇచ్చింది. ఇక త‌న‌కు రాజ‌కీయాలంటే ఇష్టం లేద‌ని... వ‌చ్చే ఐదేళ్ల‌లో రాజ‌కీయాలు నేర్చుకుని.. ఆ దిశ‌గా అడుగులు వేస్తానేమో అని కూడా చెప్పింది. ఏదేమైనా త‌మ‌న్నాకు న‌చ్చినోడు దొరికితే ఆమె వెంట‌నే అత‌డితో మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీగానే ఉంది.


ఇక త‌మ‌న్నా న‌టించిన అభినేత్రి 2 సినిమా ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆమె ప్ర‌స్తుతం చిరు సైరా నరసింహారెడ్డిలో చాలా ముఖ్యమైన పాత్రను షోషిస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఐటెం సాంగ్స్ చేయటానికి సిద్ధమేనని..అయితే ముందు తనకు ఆ పాట నచ్చాలన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: