గత కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ వ్యవహరిస్తున్న తీరు ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. వర్మ లేటెస్ట్ గా ప్రకటించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ ఇంకా చిత్రీకరణ కాకుండానే జరుగుతున్న ట్విట్స్ రగడ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఇది అనవసరమైన కుల వివాదాలకు దారి తీస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

‘ఎండలకు భయపడి కాదు రెడ్లకు భయపడి కమ్మవాళ్ళు బయటకు రావడం లేదు’ అంటూ వర్మ చేసిన ట్విట్ కు కొందరు తీవ్ర అసహనానికి లోనై వర్మకు హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో తనకు వార్నింగ్ లు ఇచ్చే వారికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు ప్రారంభించాడు వర్మ.

‘నా ఫోన్ నెంబర్ ఎక్కడో పట్టుకుని, అందరికీ షేర్ చేసి, వాట్సాప్ప్ గ్రూపుల వెనక, లతివియా లాంటి పనికిమాలిన దేశాల సిమ్ కార్డుల వెనక దాక్కుని నాకు వార్నింగులు ఇచ్చే కమ్మోళ్ళు, నాకు ఈగలతో సమానం... దమ్ముంటే కనీసం కుక్కలై అరవండి... అంతేకాని దోమల్లా గీ పెట్టకండి.#KammaRajyamLoKadapaRedlu'' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. 

అంతేకాదు తనలా డైరెక్ట్ గా మాట్లాడే ధైర్యం లేక తన పై కామెంట్స్ చేస్తున్న వాళ్ళను చూస్తుంటే తనకు ఆపుకోలేని ఆవలింతలతో నిద్ర వస్తోంది అంటూ మరొక సెటైర్ పెల్చాడు. జరుగుతున్న ఈ కామెంట్స్ వార్ ను చూస్తుంటే ఇప్పటికే సమస్యల మధ్య నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనవసరమైన కులాల రగడలోకి వర్మ ఎందుకు లాగుతున్నాడో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: