యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా కోసం రోజులు గ‌డుస్తోన్న కొద్ది టాలీవుడ్‌లో ప్ర‌తి ఒక్కరిలోనూ ఎగ్జైట్‌మెంట్ తారాస్థాయికి చేరుకుంటోంది. బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ ఒక్క‌సారిగా నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు రెండు సంవ‌త్స‌రాలుగా క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. 


ఇక సాహో సినిమాను దేశ‌వ్యాప్తంగా చాలా భాష‌ల్లో రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 15న రిలీజ్ అవుతోన్న సాహో ప్రి రిలీజ్ బిజినెస్ గురించి ట్రేడ్ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాదు ఇండియాకే మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ మూవీగా రూపొందుతున్న సాహో బిజినెస్ ఒక్క తెలుగు వెర్ష‌న్‌లోనే రూ. 135-150 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. తెలుగు వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ రేటు ప‌ల‌కవ‌చ్చ‌ని అంటున్నారు.


ఇక‌ హిందీ-తమిళ్-కన్నడ-మలయాళం నుంచి క‌నీసం రూ. 80-100 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌రుగుతుందంటున్నారు. కేవ‌లం రూ.200 కోట్ల వ‌ర‌కు డిస్ట్రిబ్యూట‌ర్ల ద్వారానే నిర్మాత‌ల‌కు వ‌స్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ అన్ని భాష‌ల‌కు క‌లిపినా త‌క్కువ‌లో త‌క్కువుగా రూ.75 కోట్లు వ‌స్తాయ్‌. ఇక డిజిట‌ల్ రైట్స్ రూ.35-50 కోట్ల వ‌ర‌కు ఛాన్స్ ఉంది. అంటే సాహో బ‌డ్జెట్ రూ.250 కోట్ల పైనే అంటున్నారు. రిలీజ్‌కు ముందే పెట్టుబ‌డి వ‌చ్చేసి లాభాలు రానున్నాయ్‌.


ఇక అన్ని భాష‌ల‌కు క‌లిపి ఓవ‌ర్సీస్ లెక్క‌లు క‌లిపితే అవి చాలా ఉంటాయ్‌. ఇవ‌న్నీ నిర్మాత‌ల జేబుల్లోకి లాభాలే. మ‌రి బిజినెస్ ఈ రేంజులో ఉంటే సాహో ఓపెనింగ్స్ ఏ రేంజులో ?  ఉంటాయో ?  చూడాలి. సినిమాకు వ‌చ్చిన టాక్‌ను బ‌ట్టి సాహో బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: