నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ 118 సినిమాతో ఒక్క‌సారిగా ట్రాక్‌లోకి వ‌చ్చాడు. ఎప్పుడో 2015లో వ‌చ్చిన ప‌టాస్ సినిమాతో హిట్ కొట్టిన క‌ళ్యాణ్‌రామ్ మ‌ధ్య‌లో న‌టించిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. ఇక 118 సినిమా త‌ర్వాత జోష్‌లో ఉన్న క‌ళ్యాణ్ ఇప్పుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.


రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ లాంటి మాస్ హిట్ సినిమా తీసిన సంప‌త్‌నంది ఆ త‌ర్వాత గోపీచంద్‌తో గౌత‌మ్‌నందా లాంటి సినిమాలు తీసినా స‌క్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు త‌న స్థాయి హిట్‌తో ఫామ్‌లోకి వ‌చ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే సంప‌త్‌ ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేష‌న్‌లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే క‌ళ్యాణ్ బాడా లాంగ్వేజ్‌కు త‌గ్గ‌ట్టుగా స్క్రిఫ్ట్ కూడా రెడీ అయిన‌ట్టు స‌మాచారం. 


ఈ స్క్రిఫ్ట్ క‌ళ్యాణ్‌కు బాగా న‌చ్చ‌డంతో క‌ళ్యాణ్ కూడా సంప‌త్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇక కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘తుగ్లక్’ సినిమా, సతీష్ వేగ్నేశ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత సంప‌త్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈ సినిమాతో హిట్ కొట్టాల‌ని భావిస్తోన్న సంప‌త్ క‌ళ్యాణ్‌కు హిట్ ఇస్తాడో ?  లేదో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: