ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున జరుగుతున్నది.  ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు.  రామ్ చరణ్ ఇండియా కు వచ్చాక ఈ షూటింగ్ లో పాల్గొంటారు.  దాదాపు రూ. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది.  


రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా చేస్తున్న సినిమా కావడంతో... అంచనాలు ఉన్నాయి.  ఇప్పటికే సినిమా బిజినెస్ కు సంబంధించిన చర్చలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది.  ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీ రేట్ పలుకుతున్నట్టు తెలుస్తోంది.  ఓ సంస్థ ఈ సినిమా కోసం ఏకంగా 66 కోట్లు అఫర్ చేసిందట.  


కానీ, నిర్మాత మాత్రం అంత తక్కువకు ఇచ్చేందుకు సుముఖంగా లేరు.  కనీసం 70 కోట్ల రూపాయల ధర వస్తేనే ఇవ్వడానికి రెడీ అయ్యారు.  తేడా నాలుగు కోట్లే కదా అనుకోవచ్చు.  అదేమీ చిన్న అమౌంట్ కాదు కదా.  బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఆయనపై ఉన్న నమ్మకంతో భారీ రేటు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.  


దానయ్య వచ్చిన రేటు కంటే ఎక్కువ పెంచడం ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచిదా లేదంటే ఏదైనా చేటు చేస్తుందా... బడ్జెట్ హైగా ఉన్నది కాబట్టి ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పులేదు.  పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: