చేస్తున్నది సాఫ్ట్ వేర్ ఉద్యోగం... ఐదంకెల జీతం.. మంచి జీవితం.  ఒక సామాన్య వ్యక్తికీ అంతకంటే ఇంకేం కావాలి.  వారానికి రెండు రోజులు సెలవులు.  మంచి ఫ్యామిలీ.. ఇబ్బందుల్లేని జీవితం కదా.  ఇవేమి అతనికి నచ్చలేదు.  తన మనసుకు నచ్చింది చేయాలని అనుకున్నాడు.  ఉద్యోగానికి రాజీనామా చేసి... తన ఫ్రెండ్ ద్వారా దర్శకుడు జయంత్ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోయాడు.  అతను ఎవరో కాదు.. మహర్షి దర్శకుడు వంశి పైడిపల్లి. 


ప్రభాస్ హీరోగా జయంత్ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమా తెరకెక్కుతోంది.  ఆ సినిమాకు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు.  ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ కు వంశికి మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.   ఆ తరువాత వర్షం సినిమాకు ప్రభాస్ పిలిచి అసోసియేట్ లో చేర్చుకున్నారు.  అదే సినిమాకు కొరియోగ్రాఫర్ లారెన్స్ పరిచయం జరిగింది.  అక్కడి నుంచి నాగార్జున మాస్ సినిమాను వంశి అసిస్టెంట్ గా పనిచేశారు.  


అనంతరం బోయపాటి దర్శకత్వంలో తెరక్కుతున్న భద్ర సినిమాకు అసిస్టెంట్ గా చేశాడట వంశి.  దిల్ రాజుతో పరిచయం ఏర్పడటంతో కథ రాసుకోమని చెప్పారట.  ఛాన్స్ దొరికితే ఎవరైనా వదిలేసుకుంటారా చెప్పండి.  వెంటనే కథ రెడీ చేసి దిల్ రాజుకు, ప్రభాస్ కు చెప్పారు.  అలా మున్నా బయటకు వచ్చింది.  రిజల్ట్ వేరేలా ఉండటం ఉండిపోయింది. 

మున్నా తరువాత చిన్న చిన్న సినిమాలు వచ్చినా చేయలేదు.  మున్నా ట్రైలర్ చూసిన తరువాత ఎన్టీఆర్ ఫోన్ చేసి బాగుందని చెప్పడంతో పాటు ప్రోత్సహించారట.  అటు రామ్ చరణ్ అనుకోకుండా కాఫీ షాప్ లో కలిసి ట్రైలర్ గురించి, సినిమా గురించి చెప్పారట.  సినిమా బాగుంది.  డైరెక్టర్ గా ఫెయిల్ కాలేదు.. ఎక్కడో ఏదో లోపం ఉంది. దానిని సరిచేసుకుంటే సరిపోతుందని అన్నారట.  


ఆ ఇద్దరు ఇచ్చిన స్ఫూర్తితోనే ఎన్టీఆర్ తో బృందావనం, రామ్ చరణ్ తో ఎవడు సినిమా చేశాడట వంశి.  స్పైడర్, భరత్ అనే నేను సినిమా సమయంలోనే మహర్షి రావాల్సి ఉంది.  కానీ, అనుకోకుండా మహర్షి 25 వ సినిమాగా రావడం తన అదృష్టం అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: