ఏ ఆర్ రెహ్మాన్.. వరల్డ్  క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్.. రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న గ్రేట్ మ్యూజిక్ మ్యుజిషియన్.  కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో రెహ్మాన్ పాటలంటే చెవులు కోసుకునేవారు.  కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  రెహ్మాన్ మ్యూజిక్ హద్దులు దాటిపోవడంతో.. ఇండియన్ మ్యూజిక్ పై పట్టుకోల్పోయాడా అనిపిస్తోంది. 

2పాయింట్ 0 సినిమా కోసం రెహ్మాన్ మ్యూజిక్ అందించాడు.  మ్యూజిక్ ఆకట్టుకోలేదు.  ఇండియన్ సినిమాల కు అందిస్తున్న సంగీతం పెద్దగా ఫలితం ఉండటం లేదు.  అయితే, విజయ్ సినిమాలకు మాత్రం వరసగా రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.  


మెర్సల్, రీసెంట్ గా సర్కార్ కు కూడా రెహ్మాన్ సంగీతం అందించాడు.  ఈ రెండు సినిమాలకు సంగీతం పర్వాలేదనిపించింది.  ఇప్పుడు స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు.  అట్లీ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను అట్లీ రెహ్మాన్ కు చూపించారట.  షూట్ చేసి ఎడిట్ చేసిన ఈ రెండు పాటలు బాగా వచ్చాయని అట్లీని రెహ్మాన్ మెచ్చుకున్నారు.  


ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో సంగీతం అందించడం అలవాటైన రెహ్మాన్ కు ఇండియన్ మ్యూజిక్ ఇవ్వడంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు.  మరి ఈ సినిమాకు రెహ్మాన్ ఎలాంటి మ్యూజిక్ అందించాడో.. సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: