అక్కినేని సమంత ... టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది.  టాలెంట్ ఉంటె పెళ్ళైన తరువాత కూడా సినిమా  అవకాశాలు వస్తాయని నిరూపించింది.  రంగస్థలం, అభిమన్యుడు సినిమాలు హిట్టయ్యాయి.  ఈ ఏడాది మజిలీతో మెప్పించింది.  


భర్త నాగచైతన్యతో కలిసి మంచి హిట్ ఇచ్చింది.  చాలా కాలం నుంచి నాగచైతన్యకు హిట్ లేదు.  హిట్ కోసం విపరీతంగా ట్రై చేస్తున్న తరుణంలో మజిలీ రూపంలో అఫర్ రావడం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంతో సినిమా హిట్ అయ్యింది.  


ఇప్పుడు మామ వెంకటేష్ తో కలిసి వెంకిమామ చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతున్నది.  ఆర్మీ నేపథ్యంలో సాగే సినిమా. అలాగని ఇది పూర్తి సీరియస్ సినిమా కాదు.  కావాల్సినంత వినోదం ఉంటుంది.  వెంకటేష్ పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నాడు.  


విషయం ఏమిటంటే సమంతతో కలిసి హిట్ కొట్టిన నాగచైతన్య.. ఇప్పుడు ఒంటరిగా హిట్ కొడతాడా లేదా అన్నది అందరిలో కలుగుతున్న అనుమానం.  సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు కూడా చైతూకు సింగిల్ గా హిట్ ఇవ్వలేకపోయారు.   మరి చూద్దాం ఈ సినిమాను ఎలా చేస్తాడో.  


మరింత సమాచారం తెలుసుకోండి: