పంజాబ్ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  సినిమా పర్వాలేదనిపించిన తరువాత ఇండస్ట్రీలో నిలబడేందుకు కృషి చేసింది.  ఆమె ప్రయత్నం సఫలం కావడంతో మంచి సినిమాలు దక్కించుకుంది.  నాన్నకు ప్రేమతో వంటి మంచి సినిమా చేసింది.  మహేష్ తో చేసిన స్పైడర్ భారీ పరాజయం పాలైంది.  


అటు రామ్ చరణ్ తో చేసిన సినిమా కూడా ప్లాప్ కావడంతో అవకాశాలు తగ్గిపోసాగాయి.  అయితే, రీసెంట్ గా బాలీవుడ్ దే దే ప్యార్ దే అనే సినిమా చేసింది.  ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ కొట్టింది.  ఈ హిట్ రకుల్ కు టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు.  ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో మన్మధుడు 2 సినిమా చేస్తున్నది.  


మన్మధుడు 2 రొమాంటిక్ జానర్ కావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.  అప్పట్లో సూపర్ హిట్టైన రొమాంటిక్ ఎంటర్టైనర్ మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా సినిమా వస్తుండటం విశేషం.  ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.  ఒకవేళ సినిమా హిట్టయితే... తెలుగులో రకుల్ కు సినిమా అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.  


రకుల్ మరీ సన్నగా జీరో ప్యాక్ బాడీతో ఉందని, అలా ఉంటె టాలీవుడ్ లో చూడరని అపవాదు ఉంది.  రకుల్ కొద్దగా లావయితే బగుంటుంది.  నాగచైతన్యతో చేసిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ చూడ చక్కగా ఉంటుంది.  అలా ఉంటె మరలా రకుల్ కు అవకాశలు రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: