తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన  మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత డి రామానాయకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తెలుగు చిత్ర సీమ ఉన్నంత వరకు ఆయన నిర్మించిన చిత్రాలు ఇప్పటికీ..ఎప్పటికీ మరువలేం. అలనాటి స్టార్ హీరోల తో ఆయన తీసిన సినిమాలు సూపర్ హిట్ మాత్రమే కాదు..చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి. 

ప్రస్తుతం ఆయన తనయులు డి.సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..ఆయన రెండో తనయుడు విక్టరీ వెంకటేష్ హీరోగా కొనసాగుతున్నారు. ఆ మద్య ఆయన మనవడు దగ్గుబాటి రానా కూడా హీరోగా కొనసాగుతున్నారు.  నేడు మూవీ మొఘల్ రామానాయుడు జయంతిని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ నిర్మాత, రామానాయుడు కుమారుడు సురేష్ బాబు ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమానికి అతిధులుగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, జి.ఆదిశేషగిరి రావు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రామానాయుడు తో వారికి ఉన్న సన్నిహిత సంబంధాల గురించి గుర్తు చేసుకున్నారు. 2015, ఫిబ్రవరి 18న కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ రామానాయుడు తుదిశ్వాస విడిచారు. వందకు పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయన చోటు సంపాదించారు



మరింత సమాచారం తెలుసుకోండి: