మహేష్ మహర్షి తరువాత చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ.  మే 31 న ప్రారంభమైన ఈ మూవీ జూన్ నెలాఖరు నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. ఇందులో మహేష్ బాబు మేజర్ పాత్ర పోషిస్తున్నారు.  మేజర్ అంటే కండలు పెంచి రఫ్ గా ఉండాలి.  


మహేష్ ఆ రఫ్ నెస్ కోసం జిమ్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.  ఇందులో ఎలాంటి నిజం లేదట.  మహేష్ కు ప్రత్యేకంగా కసరత్తులు అవసరం లేదని, చేస్తుంది మేజర్ పాత్రే అయినప్పటికీ అది కొద్దిసేపే ఉంటుందని సమాచారం.  


మిగతా సినిమా అంతా పల్లెటూరి నేపథ్యంలో నడుస్తుంది.  కాబట్టి మహేష్‌ బాడీ పెంచడం లాంటివి అవసరం ఏమీ వుండదని అనిల్‌ రావిపూడి చెప్పడంతో మహేష్‌ షూటింగ్‌కి ముందు ఫ్యామిలీతో కలిసి విదేశాలు టూర్‌ చేస్తూ రిలాక్స్‌ అవుతున్నాడు. పిల్లలకి స్కూల్స్‌ సెలవు కనుక వారికి వివిధ దేశాలు చూపిస్తున్నాడు. జర్మనీలో హాలిడే పూర్తి చేసుకున్న మహేష్‌ ఫ్యామిలీ ఇప్పుడు ఇటలీకి పయనమయింది.


అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.  సంక్రాంతిని టార్గెట్ చేసుకొని షూటింగ్ చేస్తారట.  అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఉంటుందని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: