మరో నెల రోజుల్లో స్టార్ మా ఛానెళ్ళో బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతుంది. ఎన్టీయార్ , నాని తరువాత ఇప్పుడు నాగార్జున ఈ షోను హోస్ట్ చేయబోతున్నాడు. నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2 మీద విమర్శలు రావడంతో ఈసారి బిగ్ బాస్ నిర్వహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

గతంలో జరిగిన పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోను ఈ సారి జరగకుండా నిర్వహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈసారి ప్రముఖ సెలబ్రిటీలను ఈ షోలోకి తీసుకోబోతున్నారట. ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఎంఇపిక చేసి సంప్రదింపులు జరుపుతున్నారట.

ఈ టీవీకి చెందిన యాంకర్లు , జబర్దస్త్ కమెడియన్ ఒకరు, ఫేమస్ సింగర్ , పాత సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన హీరోయిన్లు, సినిమాల్లో బాగా గుర్తింపు పొందిన నటీనటులను ఈ సారి ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. గతంలో కొన్ని ట్రోల్స్ జరిగిన విమర్శల పాలైన బిగ్ బాస్ ఈ సారి ఎలాంటి జాగ్రత్త్లు తీసుకుంటుందో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: