ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు కార్తికేయ. ఆ సినిమాలో కార్తికేయ నటనకు జనంలో మంచి గుర్తింపు వచ్చింది. భగ్న ప్రేమికుడిగా ప్రియురాలి చేతిలో మోసపోయిన ప్రియుడిగా అద్భుతమైన నటన కనపరిచాడు అర్ ఎక్స్ 100 సినిమా రుపాయకు మూడు రుపాయల లాభం తీసుకువచ్చింది.

కానీ ఏం లాభం వచ్చిన పేరంతా హిప్పీ సినిమాతో పోయింది. హిప్పీ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. విడుదలకు ముందు ట్రైలర్లతో , టీజర్లతో ఆకట్టుకున్న హిప్పీ సినిమా కార్తికేయకు మాత్రం చాలా చెడ్డ పేరు తీసుకువచ్చింది. నువ్వు నేను ప్రేమ సినిమా తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు.

తమిళ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించాడు. కానీ ఈ సినిమా ఆయనకు భారీ నష్టాల్ని మిగిల్చే అవకాశం ఉంది. కార్తికేయ ఇప్పటినుండైనా సినిమా కథలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఇండస్ట్రీలో ఎంత త్వరగా గుర్తింపు వస్తుందో అంతే త్వరగా గుర్తింపు కోల్పోయే అవకాశం ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: