తేజ.. వర్మ శిష్య వర్గంలో ఒకరు.  సినిమాటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించి దర్శకుడిగా ఎదిగిన తేజా..ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాడు.  అన్ని డిఫరెంట్ గా ఉంటాయి.  కానీ, కొన్నే హిట్ అయ్యాయి.  వర్మ స్టైల్ ల్లో చెప్పాలి అంటే సినిమా హిట్ గురించి పెద్దగా పట్టించుకోడు.. సినిమా చేశామా లేదా అన్నది ముఖ్యం.  


తేజాలో మంచి టాలెంట్ ఉంది.  కానీ, అది ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో తెలియడంలేదు.  తేజ సినిమా జీవితం తెల్సిన వాళ్లకు ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా వరకు తెలియదు.  తేజాకు ఓ కొడుకున్నాడు.  అతనికి జబ్బు చేసింది.  కొడుకును బ్రతికించుకోవడానికి ఇండియాలో ఉన్న అన్ని హాస్పిటల్స్ తిరిగారు.  కానీ లాభం లేకపోయింది.  డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కొడుకు అనారోగ్యం తీవ్రంగా దెబ్బతింది.  


జర్మనీ, ఇంగ్లాండ్ వెళ్లి చూపించారు.  లాభంలేదు.   హాస్పిటల్ గా మార్చేశారు.  హాస్పిటల్ సామాగ్రి అంటా ఇంటికి వచ్చింది.  ఇద్దరు నర్సులు ఇంట్లోనే ఉన్నారు.  ఇంటిలోనే అని.. ఎలాగైనా బ్రతికించుకోవాలనే తపన.  కానీ ఆ తపన తపనగానే మిగిలింది.  


కొడుకు మరణించాడు.  డాక్టర్లపై కేసు  ఫైల్ చేయమని కొందరు స్నేహితులు సలహా ఇచ్చారట.  వేస్తా .. వేస్తె తన కొడుకు బ్రతికొస్తాడా అని ప్రశ్నించాడట తేజ.  ప్రపంచానికి తెలియని ఈ విషయాలను తేజ ఇటీవలే బయటపెట్టాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: