తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన హీరోగా తన సత్తా చాటుతున్నాడు శ్రీ విష్ణు.  ‘ఉన్నది ఒకటే జిందగీ ’చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు తాజాగా ‘బ్రోచేవారెవరురా’చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆ మద్య రిలీజ్ అయ్యింది.  డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం నంచి తాజాగా ‘పుట్టుక్కు జర జారే’ అంటూ మూడవ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.   

పుటుక్కు జర జారే అనే ఈ పాటకు వివేక్ సాగర్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, హషిత్ గోలీ లిరిక్స్ రాసాడు.. ఆంథోనీ దాసన్ చాలా బాగా పాడాడు.. పుటుక్కు జర జర జరా, నీ టికెట్టు తూరుపు దిక్కేలే.. అటెక్కితే పడమరలే, అరే ఇటొంగి దండం పెట్టాలే.. అంటూ సాగే ఈ లిరికల్  సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. 

శ్రీ విష్ణు, నివేథా థామస్, నివేథా పేతురాజ్ హీరో, హీరోయిన్స్‌గా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో,  మన్యం క్రియేషన్స్ బ్యానర్‌పై, మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు.  కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : రవితేజ గిరిజాల, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి, హషిత్ గోలి, భరద్వాజ్, ఆర్ట్ : రామాంజనేయులు, ఫైట్స్ : గణేష్, రాబిన్ సుబ్బు, నబా.


మరింత సమాచారం తెలుసుకోండి: