తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కొన్ని సంస్థలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.  అలాంటి వాటిల్లో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.  ఈ సంస్థలో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు.  డి రామానాయుడు తన కొడుకు పేరుమీద నిర్మించిన ఈ బ్యానర్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.  


ఇక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానరును నిశితముగా పరిశీలిస్తే.. బ్యానర్ పై ఇద్దరు పిల్లలు కనిపిస్తారు.  ఆ ఇద్దరు ఎవరు.. ఎందుకు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా.  అంటే మీరు ఆ బ్యానర్ లోని వాటిని సారిఆ చూడలేదని అర్ధం సెహెసుకోచేసుకో వచ్చు.  


ఈ బ్యానర్లోని ఆ ఇద్దరు పేర్ల గురించి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చెప్పే ప్రయత్నం చేసాడు.  తెరపై సురేష్‌ ప్రొడక్షన్స్‌ అని పేరు, లోగోలో కనిపించే ఇద్దరు పిల్లల్లో ఒకరు నేను. ఇంకొకరు తమ్ముడు వెంకటేష్‌. ఒక రోజు నేనూ వెంకటేష్‌ స్కూల్‌కు వెళ్దామని రెడీ అవుతుంటే, నాన్న పిలిచారు. అక్కడ ఎస్‌.పి. అక్షరాలు తయారు చేసి ఉంటే, దానిలో ‘ఎస్‌’పై వెంకటేష్‌ నిలబడ్డాడు. ‘పి’పై నేను నిలబడ్డా. అనుకోకుండా ‘ఎస్‌’పై ఉన్న వెంకటేష్‌ స్టార్‌ హీరో అయితే, ‘పి’పై ఉన్న నేను ప్రొడ్యూసర్‌ అయ్యా.  నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలు చేయాలని ఆసక్తి లేదు. అన్నారు. 


అంతేకాకుండా, సినిమాలకు సంబంధించిన డైలీ కలెక్షన్స్‌ గురించి రోజూ రాసేవారు. దానిని  నేను నోట్‌బుక్‌లో కాపీ చేస్తుండేవాడిని. అలా నాకు తెలియకుండానే నిర్మాణ రంగంవైపు అడుగులు వేశా. అంతేకాదు, సినిమా రంగంలో ఎలా క్రమశిక్షణగా ఉండాలో నేను, వెంకటేష్‌ ఆయన నుంచి నేర్చుకున్నాం.. అని ఈ సర్దార్భంగా పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: