నిన్న హైదరాబాద్ లో జరిగిన ఎస్వీ రంగారావు జీవితానికి సంబంధించిన ఫోటోబయోగ్రఫీ మహానటుడు పుస్తక ఆవిష్కరణ సభకు చిరంజీవి ముఖ్యతిధిగా వచ్చాడు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ చిరంజీవి అభిమానులకు చేసిన సూచన చిరంజీవికి కూడ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆగష్టులో చిరంజీవి పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం మెగా అభిమానులు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండే విషయాలను ప్రస్తావిస్తూ తమ్మారెడ్డి ఒక సూచన చేసారు. చిరంజీవి పుట్టినరోజునాడు చిన్నచిన్న కార్యక్రమాలకు బదులు ప్రతి ఊరులోని మెగా అభిమానులు ఒకొక్కరు 500లు చొప్పున చందాలు వేసుకుంటే వేల సంఖ్యలో ఉండే చిరంజీవి అభిమానుల వల్ల లక్షలు వసూలు అవుతాయని ఆ మొత్తంతో ఏదైనా మంచి కార్యక్రమం చేయవచ్చు కదా అంటూ తమ్మారెడ్డి మెగా స్టార్ అభిమానులకు పిలుపు ఇచ్చారు. 

అంతేకాదు తమ్మారెడ్డి ఇదే ఫంక్షన్ లో చిరంజీవి వైపు చూస్తూ చిరంజీవి ఇలాంటి పిలుపు ఇస్తే మన ఇరు రాష్ట్రాలలోని ప్రతి ఊరులోను కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతాయి అంటూ అభిప్రాయ పడ్డారు. ఈ సూచనకు చిరంజీవి నవ్వుతు తన అంగీకారం తెలిపినా మెగా స్టార్ నోటివెంట తమ్మారెడ్డి సూచనకు సపోర్ట్ ఇవ్వలేదు. 

దీనితో ఆ కార్యక్రమానికి వచ్చిన చాలామంది తమ్మారెడ్డి సూచన చిరంజీవికి నచ్చలేదా లేకుంటే అటువంటి లేకుంటే పిలుపు ఇచ్చినా మెగా అభిమానులు సరిగ్గా స్పందించరని చిరంజీవికి ముందుగానే తెలుసా అంటూ కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. టాప్ హీరోల కటౌట్ లపై వందల లీటర్లు పాలాభిషేకం చేసే అభిమానులు ఆపాలతో ఆహారం లేని చిన్నారులకు సహాయం చేయవచ్చు కదా అంటూ గతంలో స్వయంగా జూనియర్ పిలుపును ఇచ్చినా అతడి అభిమానులు పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో తమ్మారెడ్డి పిలుపుకు చిరంజీవి అభిమానులు ఎంతవరకు స్పందిస్తారు అన్నది తెలియాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: