సొట్ట బుగ్గల తాప్సి.. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఈ నటి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ అనేక సినిమాల్లో నటించింది.  ఇప్పుడు అక్కడ టాప్ హీరోయిన్ గా ఏకచక్రాధిపత్యం వహిస్తోంది.  


రీసెంట్ గా ఈ అమ్మడు గేమ్ ఓవర్ అనే సినిమా చేసింది.  ఈ సినిమా షూటింగ్ మంచు కొండల్లో చిత్రీకరించారు.  అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ చేయాల్సి వచ్చింది.  ఆ సమయంలో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలాయి.  కాళ్లకు పిండికట్టు, చేయి ఎర్రగా కమిలిన గాయాలతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.  


సినిమా కోసం రిస్క్ తీసుకోవచ్చు.  ఇలా దెబ్బలు తగిలేలా రిస్క్ తీసుకుంటే ఎలా చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.  ఇప్పుడీ గాయాలు తగ్గే వరకు షూటింగ్ చేయకూడదు.  కాబట్టి ఈ అమ్మడు రెస్ట్ తీసుకోక తప్పదు. ప్రస్తుతం మంచుకొండ్ల నుంచి చెన్నైకు తిరిగి వచ్చింది.  


మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ ఉన్నది.  కాబట్టి సినిమా ప్రమోషన్స్ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధం అయ్యింది.  సినిమా విజయం  కావాల్సింది ఏముంది.  ఎన్ని గాయాలైనా విజయం ముందు చిన్నబోతాయి.  బాలీవుడ్ లో వరస దూసుకుపోతున్న తాప్సి ఈ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: