సాయంకాలం అయితే ఆకాశంలో చందమామ కనిపిస్తుంది.  మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.  చల్లని వెన్నెలను కురిపిస్తుంది.  వెండితెరపై మెరుపులు మెరిపించే చందమామ మరొకటి ఉంది.  అదే కాజల్ అందం.  కాజల్ వెండితెరపై అనేక సినిమాలు చేసింది.  


మగధీర ఆమెకు టర్నింగ్ పాయింట్ సినిమా. ఆ తరువాత వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.  ఇప్పుడు తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి. ఆమె చేతిలో శర్వానంద్ తో చేస్తున్న రణరంగం ఒక్కటే ఉన్నది.  ఈ సినిమాపైనే ఆమె టాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉంది.  


కోలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడు దూసుకుపోతోంది.  వరసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.  తమిళంలో ప్యారిస్ ప్యారిస్ తో పాటు కోమలి అనే సినిమా చేస్తోంది.  ఈ రెండే కాకుండా శింబు తో మానడు అనే సినిమా చేస్తున్నది.  వెంకట్ ప్రభు దర్శకుడు.  


తమిళ్ లో చేతిలో మూడు సినిమాలు ఉడటంతో ఈ మూడింటిలో ఒక్కటి హిట్టయినా తిరిగి అవకాశాలు దక్కించుకోవచ్చు అన్నది కాజల్ ప్లాన్.  మరి కాజల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా. అయితే మంచిదే కదా.  చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: