మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమారుడైన నందమూరి బాలకృష్ణ గారు జూన్ 10 1960 సంవత్సరంలో జన్మించారు. పద్నాలుగేళ్ళ వయసులోనే తాతమ్మ కల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసారు. రామోజీరావు కుమార్తె వసుంధరా దేవి గారిని వివాహమాడారు. బాలకృష్ణ , వసుంధరాదేవిలకు ముగ్గురు సంతానం.


జననీ జన్మభూమి, మంగమ్మ గారి మనవడు, సాహసమే జీవితం, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి సినిమాలు బాలకృష్ణ కెరీర్లో సూపర్ హిట్లుగా నిలిచాయి. సమరసింహారెడ్డి , నరసింహరాయుడు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా, కలెక్షన్లు, 50 100 డేస్ సెంటర్లలో రికార్డులు సృష్టించాయి.

 

2004లో వఛిన లక్ష్మీ నరసింహ తరువాత కొంతకాలం పాటు ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణా 2010లో సింహా సినిమాతో రికార్డుల మోత మ్రోగించాడు. ఆ సినిమా స్థాయికి తగ్గకుండా బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రాజకీయాల్లో కూడా బాలయ్య విజాయాలతో దూసుకుపోతున్నడు. 2014లో హిందూపురం నుండి గెలిచిన బాలయ్య 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇలాగే బాలయ్య మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ మరెన్నో మంచి సినిమాలు అందించాలని ఆశిద్దాం


మరింత సమాచారం తెలుసుకోండి: