వెంకటేష్.. రాఘవేంద్రరావు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి.  1991 లో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన కూలీ నెం1 సినిమా సూపర్ హిట్ కొట్టింది.  ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ టబు హీరోయిన్.  తరువాత తెలుగులో నాగార్జున తో నిన్నెపెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడ సినిమాలు చేసింది. 
హిందీలో ఆఫర్లు రావడంతో ముంబై వెళ్లి అక్కడి సెటిల్ అయ్యింది.  ఆ తర్వాత తెలుగులో సినిమాలో చేసిన పెద్దగా ఆడలేదు. బాలకృష్ణ తో పండురంగడు చేసింది. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ తెలుగులో మెరుపులు మెరిపించేందుకు సిద్ధం అయ్యింది టబు.
అల్లు అర్జున్ 19 వ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.  త్రివిక్రమ్ దర్శకుడు. అయితే ఇందులో ఈ బ్యూటీ తల్లి పాత్రను చేస్తున్నది.  ఒకవైపు తల్లి పాత్రను చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా చేసేందుకు సిద్ధమైంది. అదీ వెంకటేష్ తో.  28 ఏళ్ల క్రితం ఇద్దరు కలిసి కూలీ నెం1 చేశారు.
ఇప్పుడు మరలా ఇద్దరు కలిసి దే దే ప్యార్ దే సినిమా చేయబోతున్నారు.  హిందీలో సూపర్ హిట్టయిన ఈ సినిమా రైట్స్ ను సురేష్  ప్రొడక్షన్ సంస్థ తీసుకుంది.  హిందీలో అజయ్ దేవగన్ చేసిన రోల్ ను తెలుగులో వెంకటేష్ చేస్తున్నారు.  టబు పాత్రను టబు.. ప్రియురాలు పాత్రను రకుల్ ప్రీత్ చేస్తున్నట్టు తెలుస్తుంది.  అయితే ఈ రీమేక్ మూవీ కి దర్శకుడు ఎవరు అన్నది త్వలోనే తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: