ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను బట్టి ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపు కోసం ఎంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది. మద్రాసు నుంచి ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి అలనాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఎంతో చొరవ చూపిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ అలాంటి చొరవ తామంతా జగన్ నుంచి ఆశిస్తున్న విషయాలను షేర్ చేసాడు. 

2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ నవ్యాంద్ర అనే రెండు రాష్ట్రాలుగా విడిపోవడం కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ కార్య కలాపాలన్నీ హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కు కూడ మారతాయి అని ఆశించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై పెద్దగా శ్రద్ద పెట్టకపోవడంతో ఆ కల నెరవేరలేదు అంటూ సురేశ్ బాబు కామెంట్స్ చేసాడు. అయితే ఇప్పుడు యువ ముఖ్యమంత్రిగా జగన్ చేతికి అధికారాలు రావడంతో ఈ అంశం మరోసారి తెరపైకి రావడంతో ఇప్పుడు తామంతా జగన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న విషయాలను తెలియచేసాడు. 

అయితే వాస్తవానికి వైజాగ్‌లో స్టూడియోలు నిర్మించడానికి సినీ ఇండస్ట్రీ సుముఖంగా ఉందని ఈ అంశంపై ప్రభుత్వం నుండి ప్రోత్సాహం రావాలని జగన్ తన నిర్ణయాలు వివరిస్తే వైజాగ్ లో స్టూడియోల నిర్మాణం జరగడం పెద్ద విషయం కాదని సురేశ్ బాబు అభిప్రాయపడుతున్నాడు. అంతేకాదు ప్రభుత్వ  నిర్ణయాలు తెలిసిన వెంటనే తాను వైజాగ్ లో తన స్టూడియోని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఫిలిం స్టూడియోగా మార్చడానికి తాను సుముఖంగా విషయాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి సురేశ్ బాబు తీసుకు వెళుతున్నాడు. 

దీనితో త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులతో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించబోయే సమావేశానికి రంగం సిద్ధం అవుతోంది అనుకోవాలి. విశాఖపట్నం ప్రాంతంలో విపరీతమైన లోకల్ టాలెంట్ లభించే పరిస్థుతులలో ఇండస్ట్రీ వైజాగ్ లో కూడా అభివృద్ధి చెందితే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ విశాఖపట్నం రెండు కళ్ళుగా మారే ఆస్కారం ఉంది..     


మరింత సమాచారం తెలుసుకోండి: