అర్జున్ రెడ్డి హీరోయిన్ ఫోటో పెట్టి.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని అంటున్నారు.. ఏం ఎగిరిపోవాలి... ఏం బాగుంటుంది.. అని మాత్రం అడగకండి.. ఫోటోను చూపించి ఈ పాటకు అర్ధం చెప్తే... సెన్సార్ కట్ అవుతుంది. దానిని పక్కన పెట్టి అసలు విషయంలోకి వెళదాం.  

అర్జున్ రెడ్డి సినిమాలో హాట్ హాట్ గా నటిస్తూ.. ముద్దులతో ముంచెత్తిన షాలినికి ఆ సినిమా తరువాత జెట్ స్పీడ్ లో అవకాశాలు వస్తాయని అనుకున్నారు.  కానీ, అవకాశాలు దరిదాపులకు కూడా రాలేదు. అవకాశాలు రాలేదు కదా అని డల్ గా ఉంటె ఎలా అందుకే.. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని ఫోటోలు పెట్టడం మొదలు పెట్టింది. 

సమ్మర్ కావడంతో సమ్మర్ వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేసింది.  బికినీ లాంటి డ్రెస్ తో సైడ్ యాంగిల్ లో ఉన్న ఆ ఫోటో అదరహో అనిపించింది.  ఇక ఈ ఫొటోకు షాలిని ఏమని క్యాప్షన్ ఇచ్చిందో తెలుసా.. మాయలో పడేస్తాను అని ఇచ్చింది.  ఫోటోను చూస్తే ఎవరైనా సరే షాలిని మాయలో పడిపోవడం ఖాయమే కదా.  

ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది శాలిని.  తెలుగులో అనుష్క చేస్తున్న సైలెంట్ సినిమాలో ఓ కీలక రోల్ ప్లే చేస్తోంది.  సో, స్పీడ్ తగ్గినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. వచ్చిన వాటిని వినియోగించుకుంటే చాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: