సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త ముఖ్యమంత్రి వై యస్ . జగన్మోహన్ రెడ్డి  కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లుగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.

ఎన్నికల ముందు జగన్ నవరత్నాల పేరుతో హామీ ఇచ్చాడని అందరికీ తెలిసిందే. ఆ నవరత్నాల లో మద్యపాన నిషేధం కూడా ఉంది. అయితే ఇది అమలు అవుతే తమ పరిస్థితి ఏంటి అని మందు బాబులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఆన్ లైన్ సర్వే నిర్వహించారు. నవరత్నాల్లో ఒకటైన "మద్యపాన నిషేధం"  హామీ అమలు సాధ్యమేనా ? అంటూ సోషల్ మీడియా ద్వారా జనాల అభిప్ర్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసారు.

ఈ సర్వేలో 85 శాతానికి పైగా జనం నిషేధం సాధ్యమే అని అభిప్రాయ పడ్డారు.  మరికొందరు మద్యపానం రద్దు చేస్తే ప్రభుత్వాని చాలా నష్టం జరుగుతుందని, లిక్కర్ మాఫియా చెలరేగి పోతుందని, నాటుసారా, గుడుంబా తయారు చేయడం మొదలవుతుందని దీనివల్ల జనాలకి చాలా నష్టం కలుగుతుందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: