Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 1:16 am IST

Menu &Sections

Search

కమెడియన్ సప్తగిరి సినీ ప్రస్థానం..అంత ఈజీగా సాగలేదు!

కమెడియన్ సప్తగిరి సినీ ప్రస్థానం..అంత ఈజీగా సాగలేదు!
కమెడియన్ సప్తగిరి సినీ ప్రస్థానం..అంత ఈజీగా సాగలేదు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం, ఆలి తర్వాత ఆ రేంజ్ లో కడుపుబ్బా నవ్వించిందిన కమెడియన్ సప్తగిరి. చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్.  తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా, పుంగనూరు.  కమెడియన్ గా మారక ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సప్తగిరి అనూహ్యంగా నటుడిగా మారారు.  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ పరుగు’ చిత్రంతో సప్తగిరి నటుడిగా గుర్తింపునిచ్చింది.

ప్రేమకథా చిత్రమ్,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రాలతో మంచి కమెడియన్ గా  స్థిరపడిపోయాడు. సప్తగిరి చాలా లోబడ్జెట్ కామెడీ సినిమాల్లో కనిపించాడు. శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్న‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ కోసం సహాయ దర్శకుడిగా చేరమన్నాడు. ఈ  చిత్రంలో పనిచేయడం ద్వారా సప్తగిరి చిత్రం యొక్క అన్ని విభాగాల గురించి తెలుసుకుంటూ సినీ ప్రముఖులతో మరిన్ని పరిచయాలు పెంచుకున్నాడు. అలాగే సినిమా పూర్తయ్యే సరికి ముగ్గురు సహాయ దర్శకులు మాత్రమే మిగలడంతో పని ఎక్కువ కావడంతో పాటు పరిజ్ఞానం కూడా లభించింది.

తరువాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. బొమ్మరిల్లు సినిమాలో తన హావభావాల్ని పరిశీలించిన భాస్కర్ ఈ సినిమాలో కూడా ఓ పాత్ర రూపకల్పన చేశాడు. మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశం పోగొట్టుకోకుండా ఉండటం కోసం నటన, దర్శకత్వం రెండు పనులూ చేశాడు. తర్వాత స్నేహితుడు ఆనంద్ రంగా తీసిన ఓయ్ చిత్రంలో నటించాడు. 

తర్వాత కందిరీగ, దరువు, నిప్పు, మంత్ర, గబ్బర్‌ సింగ్‌ లాంటి సినిమాల్లో నటించాడు. అదే సమయంలో దర్శకుడు మారుతి తీసిన ఈ రోజుల్లో చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో విడుదలై మంచి విజయం సాధించింది.  మారుతితో మంచి పరిచయం ఆ పరిచయంతో   ‘ప్రేమకథా చిత్రమ్’ లో అవకాశం కల్పించాడు. ఆ చిత్రంలో దెయ్యంతో మాట్లాడుతూ.. ఏ అక్కా మళ్లీ కొడతావా..అక్కా కాసేపు రెస్ట్ తీసుకో అంటూ ఫన్నీ డైలాగ్స్ కడుపుబ్బా నవ్వించాయి.  తర్వాత దృశ్యం, మనం, పవర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, మజ్ను తదితర చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలో తాను వైద్యం కోసం వెళుతున్న హోమియో వైద్యుడు డాక్టర్ రవి కిరణ్ ఆ చిత్రాన్ని నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చాడు.

‘సప్తగిరి ఎక్స్ ప్రెస్ ’ అనే పేరుతో డిసెంబరు 2016 లో ఈ చిత్రం రిలీజ్ కావడం మంచి టాక్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ‘సప్తగిరి ఎల్ఎల్‌బీ’ చిత్రం యావరేజ్ టాక్ వచ్చింది. కామెడీ హీరోగా జోష్ కొనసాగిస్తున్న కమెడియన్ సప్తగిరి నటించిన తాజా చిత్రం ‘వజ్ర కవచధార గోవింద’. శివ శివం ఫిల్మ్స్ బ్యానర్‌పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మాతలుగా అరుణ్ పవర్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకు బుల్గానియన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 14న విడుదల కానుంది.


comedy-hero-saptagiri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి! : సీఎం జగన్
చెత్తకుప్పలో దొరికిన చిన్నారి..దత్తత తీసుకున్న దర్శకుడు!
ఎవడైనా సరే తోలు తీస్తా..అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే రోజా సీరియస్ !
ప్రతి సోమవారం "స్పందన" : సీఎం జగన్
‘రంగ్ దే’ తో వస్తున్న నితిన్!
ప్రజలను వంచించిన ఏ ప్రభుత్వం నిలబడదు : సీఎం జగన్
మనసున్న మారాజు మంత్రి మల్లన్న!
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం..30 మంది మృతి!
శ్రీలంక చేతిలో చిత్తైన ఇంగ్లాండ్!
ప్రియుడి ఎదుటే దారుణంగా అత్యాచారం..!
క్లీవేజ్ షో చేస్తే ఆ పనిచేశాడా?
అదీ లెక్క.. వాట్ ఏ కాంబినేషన్ గురూ!
కెవ్...కేకా..‘హా..హా..హా..హా’ అంటూ బాలయ్య యెగాసనాలు..వీడియో వైరల్!
బ్రేకింగ్ : ఏపీ సీఎం జగన్ కి ఎదురు వెళ్లి మరీ స్వాగతం పలికిన కేసీఆర్..!
సమంత ‘ఓ బేబీ’ ట్రైలర్ అదుర్స్ !
మోడీ కే జై కొడుతున్న తెలుగుదేశం బడానేతలు!
టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీనే..! : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రూ.250 కోట్ల క్లబ్ లో ‘భారత్’!
ఫృథ్వి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు!
చింతమనేనికి మరో షాక్..కేసు నమోదు!
ఫోటో ఫీచర్ : బైకా..ఆటోనా..? కంట్రోల్ ఎలా చేస్తావు నాయనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.