ఒకప్పుడు హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఉండేది.  ఇలా వచ్చిన రెమ్యునరేషన్ తో రెస్టారెంట్, రియల్ ఎస్టేట్, సినిమా బిజినెస్ రంగంలోకి దిగేవారు.  ఇప్పుడు కాస్త ట్రెండ్ మారింది.  చాలామంది మల్టీప్లెక్స్ థియేటర్స్ రంగంలోకి దిగుతున్నారు.  అలా దిగి సక్సెస్ సాధించిన వాళ్లలో మహేష్ బాబు ఒకరు.  


మహేష్ ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మించారు.  హైదరాబాద్ లోనే టాప్ క్లాస్  థియేటర్ అది.  ఇప్పుడు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువుగా అక్కడే జరుగుతున్నాయి.  ఇదిలా ఉంటె, హీరోలతో పాటు ఇప్పుడు దర్శకులు కూడా ఈ రంగంలోకి దిగుతున్నారు.  


దర్శకుడు త్రివిక్రమ్.. సినిమా ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టాడు.  రాజానగరంలోని రాయుడు థియేటర్ ను తీసుకొని మరమ్మత్తులు చేసి కొత్త హంగులతో నూతనంగా మార్చేశారు.  దీనికోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.  ఇది ఇపుడు చర్చగా మారింది.  


త్రివిక్రమ్ ఒక సినిమాకు 12 కోట్ల రూపాయలు తీసుకుంటారు.  అందులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ రంగంలో పెడతారు.  చాలా చోట్ల త్రివిక్రమ్ కు ఇలాంటి రియల్ ఎస్టేట్ ప్రాపెర్టీస్ ఉన్నాయి.  దీంతో పాటు ఇప్పుడు ఈ టాప్ దర్శకుడు థియేటర్ బిజినెస్ లోకి  కూడా ఎంట్రీ ఇవ్వడం అద్భుతం అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: