ఈరోజు విడుదల కాబోతున్న ‘సాహో’ టీజర్ ఇంకా విడుదల కాకుండానే ఈ టీజర్ కు సంబంధించి జరుగుతున్న నెగిటివ్ ప్రచారం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఈ టీజర్ కు సంబంధించిన పోస్టర్స్ ముఖ్యంగా శ్రద్ధా దాస్ పోస్టర్లు పాత హాలీవుడ్ సినిమాల పోస్టర్లను పోలి ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో కొందరు పని కట్టుకుని విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. 

దీనితో ‘సాహో’ టీజర్ కు సంబంధించిన పోస్టర్లు ఈమూవీ పై అంచనాలను పెంచకుండా మరింత నెగిటివ్ ప్రచారానికి ఆస్కారం కలిగిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ కు సంబంధించిన పోస్టర్లను చూసి ప్రభాస్ వీరాభిమానులు కూడ ఈసినిమా ఫలితం గురించి కలవర పడుతున్నారు.

అయితే ఈమూవీ యూనిట్ వర్గాలు మాత్రం ఎటువంటి టెన్షన్ పడనక్కరలేదనీ ఈ టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని సంకేతాలు ఇస్తున్నాయి. అంతేకాదు ఈ టీజర్ లోని అద్భుత విజువల్స్ ఈమూవీని ఎంత భారీగా తీసారో అన్న విషయం అందరికీ తెలిసేలా ఈ టీజర్ ను కట్ చేసినట్లు సమాచారం. 

మరీ ముఖ్యంగా ఈ టీజర్ ను చూసిన తరువాత విమర్శకుల నోళ్ళు మూసుకుపోతాయని ఇప్పటి వరకు ఈమూవీ పై జరిగిన నెగిటివ్ ప్రచారం ఈరోజుతో సమసి పోతుందనీ ఈమూవీ యూనిట్ వర్గాలు లీకులు ఇస్తున్నాయి. ఈ టీజర్ ప్రతిస్పందనను బట్టి ఈమూవీ మార్కెట్ అదేవిధంగా ఫ్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు మరి కొన్ని గంటలలో విడుదల కాబోతున్న ‘సాహో’ టీజర్ గురించి ప్రభాస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: