విజయ్ సేతుపతి తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నాడు. తమిళంలో డిఫరెంట్ గా ఉండే పాత్రలు ఎంచుకొని సినిమాలు చేయడం విశేషం.  ఇప్పుడు హీరో హీరో తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఒకటి మెగాస్టార్ సైరా కాగా, రెండో సినిమా మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన.  


మెగాస్టార్ సినిమా పీరియాడికల్ స్టోరీ.  అందులో ఓ యోధుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు.  ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించినట్టు సమాచారం.  ఈ సినిమా తరువాత విజయ్ తెలుగులో చేస్తున్న సినిమా ఉప్పెన.  ఒకవైపు తమిళంలో హీరోగా చేస్తూ.. 


మరోవైపు తెలుగులో విలన్ గా, హీరోయిన్ కు తండ్రిగా నటించడం అంటే మామూలు విషయం కాదు.  ఏ హీరో కూడా ఇలా నటించేందుకు ఒప్పుకోరు.  కానీ, విజయ్ విలక్షణ నటుడు కాబట్టి ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు.  ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టికి తండ్రిగా నటిస్తున్నాడు.  


అలాగే ఇందులో ఆయనే విలన్ అనికూడా రివీల్ చేశారు.  వైష్ణవ్ తేజ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.  దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభం అయ్యింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: