నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎమ్.ఎల్.ఏ. ల ప్రమాణస్వీకార ఘట్టం పవన్ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశను కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పవన్ ను చూడలేకపోయినా కనీసం ఎమ్.ఎల్.ఏ. గా అయినా పవన్ ప్రమాణస్వీకారాన్ని చూడాలని కలలు కన్న పవన్ అభిమానుల కోర్కెలు పరోక్షంగా ‘జనసేన’ టిక్కెట్ పై ఏకాకిగా ఎన్నిక అయినా రాపాక వరప్రసాద్ తీర్చాడు. 

ఇప్పటికే ఇతడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నాడు అంటూ అన్న వార్తలకు సమాధానంగా అతడు భుజం పై వేసుకు వచ్చిన ‘జనసేన’ కండువాలోని పవన్ ఫోటో పై స్పష్టంగా మీడియా కెమెరాల దృష్టి పడింది. ఇప్పుడు రాపాక వేసుకున్న పవన్ కండువా ఫోటో బయటకు లీక్ అవ్వడంతో అది పవన్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

ఇదే సందర్భంలో అసెంబ్లీ లాబీలో తనకు ఎదురైన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాపాక ఒక షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. పవన్ ‘జనసేన’ లోనే కొనసాగుతారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే 152 ఎమ్.ఎల్.ఏ. గా మాత్రమే ఉంటానని అదే తాను ‘జనసేన’ లో కొనసాగితే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతాను అంటూ తన పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు.

అయితే రాపాక కామెంట్స్ పవన్ అభిమానులకు వేరే విధంగా అర్ధం అవుతున్నాయి. పవన్ ‘జనసేన’ కు నెంబర్ వన్ అయిన నేపధ్యంలో రాపాక ‘జనసేన’ లో నెంబర్ వన్ గా ఎలా మారుతాడు అంటూ కొందరు పవన్ అభిమానులు రాపాక ను ప్రశ్నిస్తున్నారు. ఏది ఎలా చూసుకున్నా 137 చోట్ల పోటీ చేసి 120 స్థానాలలో డిపాజిట్లు పోగొట్టుకుని పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోయినా ఏకైక ప్రతినిధిగా ‘జనసేన’ కు రాపాక మిగలడం అత్యంత ఆశ్చర్యకరం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: