సమంత తల్లి కాబోతోంది అంటూ మీడియాని షేక్ చేసిన వార్తలకు ఖండన ఇచ్చిన సమంత ఆ వార్తలకు సమాధానంగా షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. సమంత తల్లి కాబోతోంది అంటూ ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం సమంత దృష్టికి వెళ్ళే సమయానికి ఆమె తన జిమ్ లో చెమటలు కక్కుతూ వర్కౌట్ చేసుకుంటోందట. 

ఆవార్తలకు ఖండన ఇచ్చిన సమంత తాను చిట్టిపొట్టి గౌన్లు వేసుకున్న మూడు ఫోటోలను సోషల్ మీడియాలో అదేరోజు షేర్ చేసింది. దీనితో సమంత తాను ఇప్పట్లో తల్లి అయ్యే ఉద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చినట్లు అయింది. అయితే సమంత షేర్ చేసిన ఆఫోటోల పై కొందరు జోక్ చేస్తూ తల్లి కాకుండా ఇలా ఎప్పుడు ఆంటీలానే ఉండిపోతావా అంటూ కొందరు సమంతను ట్రోల్ చేస్తున్నారు. 

మరికొందరైతే 30 సంవత్సరాలు దాటిపోయి పెళ్లి చేసుకున్న సమంత ఆంటీగానే తమకు కనిపిస్తోంది అంటూ మరిన్ని జోక్స్ పేలుస్తున్నారు. ప్రస్తుతం సమంత తల్లి కాబోతోందా? అంటూ వార్తలు వచ్చిన తరువాత మరింత రెచ్చిపోయి ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు నాగార్జున షాక్ అయినట్లు తెలుస్తోంది.

సమంత ఈ సెటైర్లు ఏమీ పట్టించుకోకుండా ప్రస్తుతం జూలైలో విడుదల కాబోతున్న ఆమె లేటెస్ట్ మూవీ ‘ఓ బేబి’ ప్రమోషన్ పై చాల శ్రద్ధ కనపరుస్తోంది. కేవలం సమంత క్రేజ్ ను బట్టి ఈమూవీ ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి అని అభిప్రాయ పడుతున్నారు. ‘యూటర్న్’ ఫెయిల్ అవ్వడంతో సమంత హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలకు పనికి వస్తుందా లేదా అన్న విషయం ‘ఓ బేబి’ సక్సస్ పై ఆధారపడి ఉంటుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: