‘బిగ్ బాస్ 3’ షోలో రేణు దేశాయ్ హౌస్ మేట్ గా కనపడబోతోంది అంటూ వస్తున్న వార్తల పై రేణు దేశాయ్ మీడియాకు క్లారిటీ ఇచ్చింది. తాను ‘బిగ్ బాస్ 3’ లో కనిపిస్తాను అంటూ వచ్చిన వార్తలు నిరాధారం అని తనకు అలాంటి షోలలో పాల్గొనే ఉద్దేశం లేదనీ కేవలం తమ షోకు ప్రచారం కల్పించుకోవడం కోసం ఆ షో నిర్వాహకులు ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తీసుకు వచ్చి ఉంటారు అని అభిప్రాయ పడింది. 

అయితే తనకు బుల్లితెర రియాలిటీ షోలు ఇష్టమే అయినా అవి హోస్ట్ చేయడానికి తాను ముందుకు వస్తాను కాని వాటిలో పాల్గొనడం తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను మరాఠీ హిందీ భాషలలో నిర్మించబోతున్న సినిమా స్క్రిప్ట్ పై తాను దృష్టి పెట్టానని ఆమూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అన్న లీకులను రేణు దేశాయ్ ఇస్తోంది.

కొన్ని సినిమాలలో ప్రత్యేక పాత్రల కోసం తనను సంప్రదిస్తున్న విషయాలను వివరిస్తూ ఆ సినిమాల విషయమై కూడ త్వరలోనే తాను క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలియచేసింది. ముఖ్యంగా ‘బిగ్ బాస్ 3’ లో తాను పాల్గోనబోతున్నట్లు వార్తలు రావడంతో వేలాదిమంది అభిమానులు ఈవిషయమై క్లారిటీ అడుగుతూ పంపిన మెసేజ్ లతో తన సెల్ ఫోన్ ఇన్ బాక్స్ ఫుల్ అయిపోవడమే కాకుండా తన సెల్ బ్యాటరీ చార్జ్ అయిపోయిన విషయాన్ని వివరించింది. 

ఇది ఇలా ఉండగా రేణు రెండవ పెళ్లి నిశ్చితార్ధం జరిగినా ఆపెళ్ళి విషయమై ఈమె మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి కనపరచక పోవడంతో ఈ పెళ్ళి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికితోడు రేణు ఇలా రెండవ పెళ్లి చేసుకోవడం అకిరా నందన్ కు ఇష్టం లేదు అన్న గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: