మన్మధుడు సినిమా.. తెలుగులో అప్పట్లో భారీ హిట్టైంది.  త్రివిక్రమ్ డైలాగ్స్, విజయ భాస్కర్ దర్శకత్వంతో మన్మధుడు సూపర్ హిట్ అయ్యింది.  ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  ఇది 16 సంవత్సరాల క్రిందట వచ్చిన సినిమా.  ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు.  

రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.  రాహుల్ దర్శకుడిగా ఇది రెండో సినిమా.  సెకండ్ సినిమా నాగార్జున తో చేస్తున్నాడు.  అది ఓ క్లాసిక్ హిట్ సినిమాకు సీక్వెల్.  ఆకట్టుకుంటుందా.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండో సినిమా గండం ఉన్న సంగతి తెలిసిందే.  

అప్పట్లో నాగార్జున చాలా క్యూట్ గా ఉండేవాడు.  ఇప్పుడు వయసు 50 దాటిపోయింది.  ఎంత కవర్ చేసినా వృద్దాప్య ఛాయలు పేస్ లో తప్పకుండా కనిపిస్తాయి.  మరి వీటిని సినిమాలో ఎలా మ్యానేజ్ చేస్తున్నారో చూడాలి.  అంతేకాదు, ఇందులో రకుల్, కీర్తి సురేష్ లు మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు.  

ఇద్దరు చాలా యంగ్ హీరోయిన్లు.  వీరిద్దరూ నాగార్జునకు సెట్ అవుతారా ఏమో.  స్క్రీన్ ప్రజెంటేషన్ సెట్ అవుతుందా.  సమంత ఓ కీలక పాత్ర చేస్తోంది.  సమంత సెంటిమెంట్ ను ఈ సినిమాలో కూడా ఫాలో కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: