తెలుగు సినిమాల మార్కెటింగ్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. బాహుబలి సినిమాతో ఈ విషయం బాగా అర్థమవుతుంది. భారీ కాన్వాసుపై బహుభాషా నటుల్ని ఎంపిక చేసుకుని  మల్టీ స్టారర్లు తీసి మార్కెట్ పెంచుకుంటున్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమాకి రాజమౌళి మార్కెట్ పెంచుకునే ఆలోచనలో ఉన్నాడట.  ఈ సినిమాని తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళికి హిందీ లో మంచి పాపులారిటీ వచ్చింది.

దానికి జతగా ఇంకా పాపులారిటీని పెంచే క్రమంలో ఉన్నాడు. అందుకోసం బాహుబలి జంట ప్రభాస్-అనుష్క జోడీని అతిధి పాత్రలో  ఆహ్వానిస్తున్నాడట.బాహుబలి స్టార్స్ గా ఈ జంటకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

అలాగే ప్రభాస్ కి జపాన్ సహా పలు దేశాల్లో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ విధంగా కూడా చాలా ప్లస్ అవుతుంది. ఇక వాళ్ళు నటిస్తున్నారా? లేదా అనేది ఇంకా నిర్దారణ కాలేదు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: