‘బిగ్ బాస్ 3’ షోకు సంబంధించి హౌస్ మేట్స్ ఎంపిక విషయంలో ‘స్టార్ మా’ టీమ్ క్లైమాక్స్ కు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షోను జూలై నుండి టెలికాస్ట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. 

ఈ కార్యక్రమానికి సంబంధించి హౌస్ మేట్స్ లిస్టులో కమెడియన్ సునీల్ కూడ ఉంటే ఈకార్యక్రమానికి మరింత రేటింగ్స్ వస్తాయి అన్న ఉద్దేశ్యంతో చివరి నిముషంలో సునీల్ ను ‘బిగ్ బాస్’ టీమ్ సంప్రదించినప్పుడు సునీల్ పెట్టిన కండిషన్స్ విని స్టార్ మా టీమ్ ఆశ్చర్యపడినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సునీల్ రోజుకు 25 లక్షలు పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 

సునీల్ నోటివెంట ఈ పారితోషికం వినగానే షాక్ అయిన బిగ్ బాస్ టీమ్ సునీల్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రోజుకు 5 లక్షలు ఆఫర్ చేసినా ఆ ఆఫర్ ను సునీల్ తిరస్కరించాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బిగ్ బాస్ షోకి సంబంధించి గీత మాధురికి రోజుకు లక్ష రూపాయలు చొప్పున ఇచ్చిన పారితోషికమే అత్యధికం అని అంటారు.

ఇలాంటి పరిస్థుతులలో ఇంత భారీ మొత్తాన్ని ఎందుకు డిమాండ్ చేసాడు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సునీల్ సినిమాలు ఫెయిల్ అయినా తన మార్కెట్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అన్న సంకేతాలు ఇవ్వడానికి సునీల్ ఇలాంటి ఆఫర్ ఇచ్చి ఉంటాడు అని కొందరు అభిప్రాయ పడుతుంటే ఇప్పటికే కెరియర్ పరంగా పరాజయాల బాటలో ఉన్న సునీల్ ఈ షోలో పాల్గొన్నా చివరిదాకా నిలబడలేక ఎలిమినేషన్ లో తొలగింపబడితే అది సునీల్ కు చెప్పుకోలేని తీవ్ర పరాభవంగా మారుతుంది కాబట్టి ఇలా వ్యూహాత్మకంగా ఏకంగా బిగ్ బాస్ టీమ్ నే భయపెట్టి ఉంటాడు అన్న మాటలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: