మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ప్రస్తుతం షూటింగ్ పాండిచ్చేరిలో జరుగుతున్న సంగతితెలిసిందే.  ఇందులో మెయిన్ హీరోయిన్ గా నయనతారను తీసుకున్నారు.  మాములుగా నయనతార పాత్ర మంచిగా ఉంటూనే నటిస్తుంది.  


కానీ, సైరా సినిమాలో నయనతార పాత్ర కేవలం గ్లామర్ గా కనిపించేందుకు తీసుకున్నారా లేదంటే ఆమె కూడా ఓ స్వాతంత్ర సమరయోధురాలా అన్నది తెలియాలి.  నయనతార పాత్ర గురించి పెద్దగా బయటకు తెలియడం లేదు.  కేవలం ఆమె ఈ సినిమాలో సైరా భార్యాగానే చూపిస్తున్నట్టు తెలుస్తోంది.  


నయనతార ఉంటె తమిళానాడు లో మార్కెట్ చేసుకోవచ్చని ఇలా చేసి ఉంటారు.  తమిళనాడులో నయనతార సినిమాలకు భారీ డిమాండ్ ఉంది.  హీరోయిన్ గా కంటే సోలోగా చేసిన సినిమాలే హిట్ అవుతున్నాయి.  దీనిని దృష్టిలో పెట్టుకొనే ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది.  


భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో నిర్మితమౌతున్న ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తయినట్టు సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: