చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం " ఆదిత్య వర్మ" . ఈ సినిమా తెలుగులో సంచలనం సృష్టించిన "అర్జున్ రెడ్డి" కి రీమేక్. వాస్తవానికి ఈ సినిమాని "వర్మ" పేరుతో బాలా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

అయితే కొన్ని కారణాల వల్ల బాలా చిత్రీకరించిన విధానం నచ్చకపోవడంతో సినిమాను  చివరి దశలో ఆపేశారు.  ఆ మధ్య విడుదలైన "వర్మ "టీజర్ కి సరైన స్పందన లభించలేదు. ధృవ్ లుక్ ఆ టీజర్ లో మరీ ఎబ్బెట్టుగా ఉంది. ఇంకా హీరోయిన్ విషయంలో కూడా నానా రచ్చ జరిగింది. టీజర్ "అర్జున్ రెడ్డి" సినిమాకి స్పూఫ్ లాగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. వీటన్నింటికి తోడు క్రియేటివ్ ఫ్రీడమ్ లేకపోవడంతో తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు బాలా ప్రకటించాడు.

బాలా చిత్రీకరించిన  మొత్తాన్ని  చెత్త బుట్టలో పడేసి, మళ్ళీ ఫ్రెష్ గా చిత్రీకరించారు. దీనికి గిరీశాయా అనే దర్శకుడిని తీసుకున్నారు.  టైటిల్ ని కూడా వర్మ నుండి " ఆదిత్య వర్మ" గా మార్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ అర్జున్ రెడ్డి పోస్టర్ ను పోలి ఉంది.

ఈ సినిమాలోని  ధృవ్ రెండు లుక్స్ ని ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించారు. ఓ వైపు గుబురు గడ్డంతో సిగరెట్ తాగుతూ..  మరోవైపు క్లీన్ షేవ్ లో హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. ఈ సినిమా టీజర్ ని ఈ నెల 16 వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కాగా ఈ సినిమాని A4 ఎంటర్టైనమెంట్స్  సంస్థ నిర్మిస్తోంది. రాధన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫి రవి కె చంద్రన్  చేస్తున్నారు. ఇంగ్లండ్ లో పుట్టి పెరిగిన మోడల్, నటి బనితా  సంధు ఈ సినిమాలో ధృవ్ సరసన నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: