చాన్నాళ్ల తర్వాత పూరి జగన్నాథ్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు మణిశర్మ. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లుగా ఎంటర్ అవ్వకముందు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కి బీభత్సమైన క్రేజ్ ఉండేది. ఎప్పుడైతే డిఎస్పి మరియు తమన్ ఎంటర్ అయ్యారో అప్పటి నుండి మణిశర్మ అందించిన బాణీలు పెద్దగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Image result for ismartshankar

అయినాగానీ మణిశర్మ ఎక్కడ నిరుత్సాహం చెందకుండా తన మార్కెట్ కింద పడకుండా ఎప్పటికప్పుడు సంచలన ప్రాజెక్టులకు మ్యూజిక్ అందిస్తూ ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇటువంటి క్రమంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోతినేని రామ్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పాటలు ఇటీవలే ఒక్కొక్కటిగా విడుదలవుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.

Image result for ismartshankar

ఇటీవలే విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' దిమాక్ ఖరాబ్ పాట తో పాటు తాజాగా విడుదలైన 'జిందాబాద్ జిందాబాద్' సాంగ్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా విడుదలైన 'జిందాబాద్ జిందాబాద్' సాంగ్ షూటింగ్ మాల్దీవ్స్ లోని బీచ్ లొకేషన్ లో చిత్రీకరిస్తున్నారు. మొత్తం మీద చానాళ్ల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ రావడం నిజంగా శుభ పరిణామమని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో తల పండిపోయిన మణిశర్మ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారో చూడాలని ప్రేక్షకులు ఈ సినిమా పై ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: