మీటు వ్యవహారంలో బాలీవుడ్ నటి తనూశ్రీ దత్త చేసిన వ్యాఖ్యలు మాములుగా లేవు.  నానా పటేకర్ పై నానా రగడ చేసింది.  ఎలాగైనా ఆయనకు బ్లేమ్ చేయాలని చూసింది.  తనను లైంగికంగా హింసించారని కోర్టులో కేసు కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  


అయితే, ఈ వ్యవహారంపై విచారించిన కోర్టు సాక్ష్యాధారాలు లేవని చెప్పి కేసు కొట్టివేసింది.  దీనిపై తనూశ్రీ స్పందించింది.  పోలీసు.. న్యాయ వ్యవస్థలకు సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం. ఆ సాక్ష్యాలు లభించకుండా ఒక వ్యక్తిని దోషి అంటూ శిక్షించకూడదని చట్టం చెబుతోందని.. అందుకే నానాకు క్లీన్ చిట్ వచ్చిందని తనూశ్రీ పేర్కొంది. 


తన కంటే ముందు ఎంతో మంది నటీమణులు నానాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా.. అతని తప్పులు బయటపడలేదన్న తనుశ్రీ.. తన కేసులో ప్రత్యక్ష సాక్ష్యుల్ని బెదిరించి వారి నోరు నొక్కేసినట్లుగా ఆరోపించారు.  తన కంటే ముందు ఎంతో మంది నటీమణులు నానాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా.. అతని తప్పులు బయటపడలేదన్న తనుశ్రీ.. తన కేసులో ప్రత్యక్ష సాక్ష్యుల్ని బెదిరించి వారి నోరు నొక్కేసినట్లుగా ఆరోపించారు.


హాలీవుడ్ లో మొదలైన మీటు ఉద్యమం బాలీవుడ్ కు ఆ తరువాత సౌత్ కు పాకింది.  మీటు కారణంగా ఎంతోమంది వారి లైఫ్ ను కోల్పోయారు.  మీటు పై కొంతమంది బహిరంగంగా కొన్ని వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: