Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 8:11 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్-3 సీజన్ వస్తోందహో...

బిగ్ బాస్-3 సీజన్ వస్తోందహో...
బిగ్ బాస్-3 సీజన్ వస్తోందహో...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ మూడవ సీజన్ రెడీ అవుతోంది. అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందని స్టార్ మా ఒక అధికారిక ప్రోమోను విడుదల చేసింది. తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ కు నాని వ్యాఖ్యాతగా ఉండగా, థర్డ్ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా రాబోతున్నారన్న విషయం మనకు తెలిసిందే. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిన కింగ్ నాగార్జున, బిగ్‌ బాస్‌ సీజన్ 3ని కూడా ముందుండి నడిపించడానికి కంకణం కట్టుకున్నారు.

 

ఐతే, మూడో సీజన్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాన్ని స్టార్ మా ప్రకటించలేదు. జులై మూడోవారం లేదా నాలుగోవారంలో ఇది ప్రారంభమవుతుందని వినికిడి. ఈ సారి బిగ్‌ బాస్‌ సరికొత్తగా సాగుతుందని ప్రోమోను చేస్తేనే మనకు అర్ధమైపోతుంది. ఇక హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరెవరన్న విషయమై ఇంకా ప్రకటన రావలసివుంది. దానికి సంబంధించిన ఓ అనఫీషియల్ లిస్ట్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో చక్కెర్లు   చేస్తోంది. కామన్‌ మ్యాన్‌ కు ఈ సీజన్ లో కూడా ఎంట్రీ లేదనేది బోగట్టా.

 

ఇంకా, హోస్ట్ గా నాగ్ పనిచేయనున్నారన్న వార్తలపైనా అధికారిక సమాచారం తెలియాల్సివుంది.  ఎందుకంటే దీనిపై ఆయన ఎటువంటి ప్రకటనలు చేయలేదు.  త్వరలో విడుదల కాబోతున్న మన్మధుడు 2  పై మన కింగ్  పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు.  20 డిసెంబర్ 2002 లో విడుదలైన "మన్మధుడు" ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే!


big-boss
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.