యంగ్ హీరో కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ "గుణ 369". బోల్డ్ కంటెంట్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన "హిప్పీ" ఫలితం కార్తీయకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న "గుణ 369" వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ అట. మరి ఈ సినిమా అన్నా కార్తికేయకి హిట్ ఇస్తోందేమో చూడాలి.
ఈ మూవీ టీజర్ రేపు విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. వేట కొడవలి పట్టుకొని సీరియస్ గా నడిచి వస్తున్న కార్తికేయ మాస్ లుక్ లో మొత్తానికి ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. గ్రామీణ నేపథ్యంలో నడిచే సీరియస్ లవ్ స్టోరీ అని పోస్టర్ ని చూస్తే తెలుస్తుంది.
ఈ సినిమా టీజర్ ని రేపు ఉదయం 11:11 నిమిషాలకు విడుదల చేయనున్నారు. "గుణ 369" మూవీని అనిల్ కడియాల, తిరుమల రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.