తెలుగులో హీరోయిన్‌గా రాణించాలని తెలుగమ్మాయిలు ఎన్నో కలలు కంటుంటారు. తెలుగు హీరోయిన్ లకు ఉన్న పరిమితుల నేపథ్యంలో వారు స్టార్ హీరోయిన్ లకు ధీటుగా ఎద‌గటం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే రాజోలు పిల్ల అంజలి మాత్రమే తెలుగుతో పాటు తమిళంలో కొద్ది రోజులపాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసింది. అంతకుమించి తెలుగు హీరోయిన్లు చాలామంది వచ్చినా వారు మీడియం రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకున్నారు. 


ఈ క్రమంలోనే వైజాగ్ అమ్మాయి అనీషా ఆంబ్రోస్ ఎన్నో ఆశలతో సినిమా రంగంలోకి వచ్చింది. దాదాపు పదికి పైగా సినిమాలు చేసిన ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ లేదు. అలియాస్ జాన‌కీ సినిమాతో వెండి తెరంగ్రేటం చేసిన ఆమె ఇటీవ‌ల న‌టించిన హ‌వీష్ 7 సినిమా కూడా హిట్ కాలేదు. పవన్ కళ్యాణ్ స‌ర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ముందుగా అనీషాను హీరోయిన్ గా తీసుకున్నారు. పవన్ తెలుగు అమ్మాయికి తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారంటూ ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. అయితే ప‌లు కారణాలతో ఆ సినిమా నుంచి ఆమెను తప్పించి ఆ ప్లేస్‌లోకి కాజల్‌ను తీసుకున్నారు.


పవన్ పక్కన నటించి ఉంటే అనీషా కెరీర్ ట‌ర్న్ అయ్యి ఉండేదేమో... ఇక సినిమాలన్నీ వ‌రుస పెట్టి ప్లాప్ అవుతుండడంతో ఆమె ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆమె గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసేసుకుంది. అనీషా పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నది తెలియకపోయినా భార్యాభర్తలిద్దరూ ఫోటోలు చూసిన నెటిజ‌న్లు పెళ్లి చేసుకుని లైఫ్‌ను ఎంచ‌క్కా ఎంజాయ్ చేయమని శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి ఆమె భర్త ఎవరో అనీషా స్వయంగా నోరు విప్పితే తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: