బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ కే కాదు అందులో నటించిన ప్రతీ ఒక్కరికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పాపులరిటీ బాగా పెరిగింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి  జనాల్లో క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటినుండి అంచనాలు బారీగా ఉన్నాయి. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇండియా మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది.

 

అయితే ఇంకొద్ది రోజుల్లో అభిమానుల ఆశ నెరవేరనుంది.  ఇప్పటివరకు " సాహో" టీ నుండి ఒక టీజర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది వచ్చి చాలా రోజులవుతున్న కారణంగా చిత్ర యూనిట్ కొత్తగా మరో టీజర్ ని విడుదల చేసారు.  తెలుగు, తమిళ, హిందీ సహా మళయాళంలో కూడా ఈ టీజర్ విడుదలైంది.  ఏ భాషలో అయినా ఈ టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

 

అయితే బాహుబలి ప్రభాస్ తో నటించడానికి పెద్ద పెద్ద స్తార్లు సైతం సిద్ధంగా ఉన్నారట.  బాలీవుడ్ స్టార్లు సైతం టీజర్ అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. దిగ్గజ బాలీవుడ్ దర్శకులు సైతం ప్రభాస్ ని సాహో లో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ తో పాటు బాలీవుడ్ నటులైన  శ్రద్ధా కపూర్, ఎవ్లిన్ శర్మ, నీల్ నితిన్ ముకేష్, చక్నీపాండే, జాకీ ష్రాఫ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్ లాంటి తారలు ప్రభాస్ తో " సాహో" లో తెరను పంచుకున్నారు.

 

ప్రతీ ఒక్కరు ప్రభాస్ గురించి విపరీతంగా పొగిడేస్తున్నారు. ప్రభాస్ తో నటించే వారి పట్ల ఆయన్ ప్రవర్తించే విధానం వారిని అబ్బుర పరుస్తుంది.  జాకీ ష్రాఫ్- ప్రభాస్ మనస్తత్వం ఒక చిన్న పిల్లాడిలాంటిదని, ఎటువంటి కల్మషం ఉండదని చెప్పుకొచ్చాడు. పెద్దల్తో ఆయన ప్రవర్తించే తీరు నిజంగా అద్భుతం అని చెప్పాడు. " సాహో" సినిమా ఆగస్టున  ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: