అనసూయ అనగానే బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ గుర్తుకు వస్తుంది.  జబర్దస్త్ కు తన యాంకరింగ్ తో వన్నె తెచ్చింది. జబర్దస్త్ లో చేస్తూనే అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు చేస్తుండేది సినిమాలో.  ఎప్పుడైతే రంగస్థలం సినిమాలో ఓ మెయిన్ పాత్ర చేసిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ మారిపోయింది.  

వరసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.  ప్రస్తుతం కథనం అనే సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నది.  ఈ సినిమా పూర్తవ్వక ముందే మెగాస్టార్ 152 వ సినిమాలో అవకాశం కొట్టేసింది.  మెగాస్టార్ తో సినిమా అంటే మాములు విషయం కాదు.  అందులోను చాలా పెద్ద కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

బహుశా ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు కాబట్టి, ఈ రెండు రోల్స్ లో ఒక రోల్ కు సంబంధించిన పాత్రకు హీరోయిన్ గా అనసూయ చేస్తుందని అనుకోవచ్చు.  ఇప్పుడు  సినిమాల్లో బిజీగా ఉండటం వలన జబర్దస్త్ కు చేయడానికి ఇబ్బంది అవుతున్నది.  

అందుకోసం జబర్దస్త్ ను పక్కన పెట్టాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.  రెండింటిని కో ఆర్టినేషన్ చేసుకోవడం కష్టం అవుతుంది.  అందుకే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి అనసూయ జబర్దస్త్ నుంచి పక్కకు వస్తే.. ఆ సీట్ ను ఎవరు ఫీల్ చేస్తారు..? రేష్మికి డబుల్ బొనాంజా అన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: