ప్రస్తుతం తెలుగు బుల్లితెర రంగంలో శ్రీముఖి పేరు చెపితే చాలు బుల్లితెర ప్రేక్షకులు వెలం వెర్రెత్తిపోతుంటారు. తన హాట్ హాట్ యాంకరింగ్‌తో శ్రీముఖి యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా మాంచి కిక్ ఇస్తుంటుంది. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్రలతో, హీరో సిస్టర్స్ రోల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ యాంకరమ్మ ఇప్పుడు బుల్లితెరను ఓ రేంజులో ఏలుతుందంటే నమ్మాల్సిందే.
శ్రీముఖి చిట్టిపొట్టి డ్రెస్సులు, చాలాకీ మాటలు చూసేందుకే తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఆమెను పిచ్చపిచ్చగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఆమె పటాస్‌తో టపాసులు పేలుస్తోంది. ఇదిలా ఉంటే ఆమె ఈ షోకు కొద్ది రోజుల పాటు గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆమెకు తెలుగు బిగ్ బాస్ -3లో ఆఫర్ రావడమే అంటున్నారు.
ఇక బిగ్ బాస్ లాంటి హాట్ షోలో శ్రీముఖి ఉంటే నానా రచ్చ రచ్చే అనుకోవాల్సిందే. తాజాగా ఆమెను ఓ అభిమాని మీరు మందు కొడతారా ? అని ప్రశ్నిస్తే ఆమె నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంది. ఈ ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా తాగుతాను..కానీ రెగ్యులర్ గా కాదు సందర్భం బట్టి..అని సూటిగా చెప్పేసింది. అలాగే ప్రస్తుతం ఉన్న యాంకర్లపై పాజిటివ్‌గా మాట్లాడి అందరి మనస్సులు గెలుచుకుంది.